Google Chromebook | న్యూఢిల్లీ, అక్టోబర్ 2: హెచ్పీతో కలిసి దేశీయంగా క్రోమ్బుక్స్ ఉత్పత్తి చేస్తున్నట్టు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. చెన్నైకు సమీపంలోని ప్లాంట్లోనే తయారు చేస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయ విద్యార్థులకు తక్కువ ధరకు ఇవి లభించనున్నాయని, దేశీయంగా తయారైన తొలి క్రోమ్బుక్స్ ఇవేనని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా తెలిపారు. నూతన క్రోమ్బుక్స్ ఆన్లైన్లో రూ.15,990 ప్రారంభ ధరలో లభించనున్నాయి.