Sundar Pichai | గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు నిరసనలు తెలపడం మానుకుని పని మీద ఫోకస్ చేయాలన్నారు. సంస్థను తమ వ్యక్తిగత వేదికగా చూడొద్దని హెచ్చరించారు. గూగుల్ తన ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్టుపై పని చేస్తున్నది. రూ.10 వేల కోట్ల విలువైన ‘ప్రాజెక్ట్ నింబస్’ తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేస్తూ గూగుల్ యాజమాన్యం తీరును విమర్శిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అమెరికా మద్దతుతో ఇతర దేశాలపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గూగుల్ ఉద్యోగులు ఆందోళనకు దిగారని వార్తలొచ్చాయి.
గతవారం న్యూయార్క్, సన్నీవేల్ లోని గూగుల్ కార్యాలయాల వద్ద సిబ్బంది ధర్నా చేశారు. ధర్నా, నిరసనకు దిగిన ఉద్యోగులను అరెస్ట్ చేయించింది గూగుల్ యాజమాన్యం. అటుపై 28 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తీరుపై సుందర్ పిచాయ్ అసంత్రుప్తి వ్యక్తం చేశారు. పనికి ఆటంకం కలిగిస్తున్న ఉద్యోగులను సుందర్ పిచాయ్ తన బ్లాగ్ లో హెచ్చరించారు. గూగుల్ని ప్రొడక్టుల తయారీ సంస్థగా మాత్రమే చూడాలని, రాజకీయాలపై చర్చించే వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు.