Gold-Silver Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా తగ్గిన మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో నగరంలో భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1200 పెరిగి తులం ధర రూ.38,670కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. 99.9 శాతం ప్యూరిటీ గోల్డ్ రేటు సోమవారం తులానికి రూ.97,470 పలికింది. మరో వైపు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,100 పెరిగి తులానికి రూ.98,150కి చేరుకుంది. అమెరికాలో పెరుగుతున్న ఆర్థిక లోటు ఆందోళనలు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ట్యాక్స్ కట్-స్పెండింగ్ బిల్‌పై మార్కెట్ దృష్టి సారించిన నేపథ్యంలో యూఎస్ డాలర్ పతనం కావడంతో పెట్టుబడిదారులను బంగారం ఆకర్షిస్తుందని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా పేర్కొన్నారు.
జులై 9కి ముందే జపాన్‌పై కొత్త సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వెండి ధర సైతం భారీగానే పెరిగింది. రూ.2వేలు పెరగడంతో కిలో ధర రూ.రూ.1,04,800కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 44.01 డాలర్లు పెరిగి 3,346.92 డాలర్లకు చేరింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డాలర్ బలహీనపడుతుండడంతో.. సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోళ్లను ఆకర్షిస్తోందని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. ఈ వారం సెంటిమెంట్ ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ తులం రూ.90,200 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.98,400గా ఉన్నది. మరో వైపు వెండి కిలోకు రూ.1.20లక్షలు పలుకుతున్నది.