Gold Rates | దేశ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.150 పెరిగి రూ.61,850 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇక ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.100 పెరిగి రూ.56,650 వద్ద స్థిర పడింది.
మరోవైపు కిలో వెండి ధర రూ.600 పెరిగి, రూ.74,900 పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడీటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1984 డాలర్లు, ఔన్స్ వెండి ధర ఔన్స్ 23 డాలర్లు పలికింది. అమెరికా బాండ్ల ధరలతోపాటు డాలర్ బలహీన పడటంతో బంగారానికి గిరాకీ పెరిగింది. యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లు పెంచకుండా యధాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
మరోవైపు, గోల్డ్ ఫ్యూచర్స్ ధర తులం (24 క్యారట్లు) రూ.94 పెరిగి రూ.60,879 వద్ద నిలిచింది. గ్లోబల్ మార్కెట్లో న్యూయార్క్లో బంగారం ఫ్యూచర్స్ ధర 0.21 శాతం పుంజుకుని ఔన్స్ బంగారం 1,991.60 డాలర్లు పలికింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, మహారాష్ట్ర రాజధాని ముంబైలలో 24 క్యారట్ల బంగారం తులం రూ.110 పెరిగి రూ.61,640లకు, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల బంగారం తులం రూ.100 పుంజుకుని రూ.56,500 వద్ద స్థిర పడింది.
చెన్నైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.100 పెరిగి రూ.62,130, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల తులం ధర రూ.90 పుంజుకుని రూ.56,950 వద్దకు చేరుకున్నది. బెంగళూరులో కిలో వెండి రూ.100 తగ్గి రూ.73 వేలు, హైదరాబాద్ లో రూ.700 పెరుగుదలతో రూ.77,700, కోల్కతా, ముంబైల్లో రూ.74,800 పలికింది.