Gold Price | న్యూఢిల్లీ, మే 21: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు కాస్త శాంతించాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం, భవిష్యత్తులోనూ ఇదే తరహా వడ్డీరేట్లను కొనసాగించనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వు సభ్యుడి వ్యాఖ్యలు బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గా లు వెల్లడించాయి. దీంతో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.550 దిగొచ్చి రూ.74,650కి పడిపోయాయి.
అంతకుముందు ధర రూ. 75,200గా ఉన్నది. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి ఏకంగా రూ.1,600 దిగొచ్చి రూ.94,500కి తగ్గింది. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ కోమెక్స్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 22 డాలర్లు తగ్గి 2,420 డాలర్లకు పరిమితమవగా, వెండి 31.60 డాలర్లుగా ఉన్నది.