Russia -Ukraine Conflict | ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ఇన్వెస్టర్లు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గాలపై కేంద్రీకరించాయి. ఫలితంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర ఏడాది నాటి గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. గురువారం తులం బంగారం ధర రూ.2,250 పెరిగి రూ.52,630కు చేరుకున్నది. మరోవైపు కిలో వెండి ధర ఐదు శాతం పెరిగి రూ.67,926 వద్ద నిలిచింది. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1925 డాలర్ల స్థాయి నుంచి 1950 డాలర్లకు దూసుకెళ్లింది. ఇది సుమారు 13 నెలల గరిష్ఠం. 1980 డాలర్ల నుంచి 2000 డాలర్ల వరకూ దూసుకెళ్తుందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, డాలర్‌పై రూపాయి మారకం విలువ గురువారం 102 పైసలు నష్టపోయింది. విదేశీ పెట్టుబడిదారులు దేశీయ స్టాక్ మార్కెట్లలో స్టాక్స్ అమ్మకాలకు దిగారు. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌పై 105 డాలర్లకు చేరుకున్నది. దీంతో క్రూడాయిల్‌పై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో గురువారం అమెరికా డాలర్‌పై రూపాయి 75.02 వద్ద మొదలై తర్వాత రూ.75.75 వరకు పడిపోయింది. తిరిగి రూ.75.63 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే డాలర్‌పై రూపాయి మారకం విలువ 102 పైసలు నష్టపోయింది.