రూ.2 వేలు ఎగిసిన వెండి ధర
న్యూఢిల్లీ, నవంబర్ 4: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకుంటున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పసిడి ధర రూ.600 పెరిగి రూ.50,870కి చేరుకున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో వెండి ఏకంగా రూ.2 వేలకు పైగా అధికమైంది.
బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి కిలో వెండి ధర రూ.2,060 అధికమై రూ.59,480 పలికింది. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 45 డాలర్లు లేదా 2.25 శాతం ఎగబాకి 1,675 డాలర్లకు చేరుకోవడంతో దేశీయంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని బులియన్ వర్గాలు వెల్లడించాయి. వెండి 19.81 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.