న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం ధర రూ. 60 వేల దిగువకు పడిపోయింది. రూ. 510 తగ్గిన తులం గోల్డ్ ధర రూ.59, 940గా నమోదైంది. రూ.920 తగ్గిన కిలో వెండి రూ. 74,680గా నమోదైంది. కానీ, హైదరాబాద్లో మాత్రం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 అధికమై రూ.61,150 పలికింది. 22 క్యారెట్ల ధర కూడా రూ.56,050కి చేరుకున్నది. రూ. 500 అధికమైన కిలో వెండి రూ.81 వేలుగా నమోదైంది.