న్యూఢిల్లీ, అక్టోబర్ 3: బంగారం తాకట్టుపై రుణాలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. పుత్తడి ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో సామాన్యుల నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ బంగారాన్ని తాకట్టుపెట్టి భారీగా రుణాలు తీసుకుంటున్నారు. బంగారం తాకట్టుపై రుణాల మంజూరుపై మార్గదర్శకాలను రిజర్వు బ్యాంక్ కూడా వెసులుబాటు కల్పించడంతో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది.
అలాగే ఇతర రుణాలతో పోలిస్తే వీటి రుణాలపై తక్కువ వడ్డీ ఉండటం కూడా మరో కారణం. లక్ష రూపాయల రుణాలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 8.35 శాతం వార్షిక వడ్డీతో రుణాలు మంజూరు చేస్తుండటం కూడా మరో కారణం. గడిచిన ఏడాదికాలంలో బంగారం రుణాలు 122 శాతం పెరిగి రూ.2.94 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు, వ్యాపార నిమిత్తం, ఇతర వ్యక్తిగత అవసరాల దృష్ట్యా పసిడిని తాకట్టుపెట్టి రుణాలు తీసుకునేవారు అధికంగా ఉంటున్నారు.