Gold Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పెరిగింది. రూ.50 పెరిగి.. పది గ్రాముల బంగారం ధర రూ.96,450కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా పేర్కొంది. మరో వైపు 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ రూ.50 పెరగడంతో ధర రూ.96వేలకు చేరి ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. ఇక వెండి ధరలు రూ.2,500 పెరిగి కిలోకు రూ.97,500కి చేరింది. స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు 13.67 డాలర్లు పెరిగి 3,224.60 డాలర్లకు చేరింది. జూన్ డెలివరీకి సంబంధించిన కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.47 శాతం పెరిగి ఔన్సుకు 3,241.50 డాలర్లకు పెరిగింది. అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా మాట్లాడుతూ.. డాలర్ బలహీనపడడం, యూఎస్ వాణిజ్య విధానంలో అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధర స్థిరంగా ఉందన్నారు.
బుధవారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ నిర్వహించినున్న విలేకరుల సమావేశంపై అందరి దృష్టి ఉందన్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన.. ఆర్థిక పరిస్థితి బలహీన పడిన నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకు ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలని పెట్టుబడిదారులు కోరుకుంటారు. ఆసియా మార్కెట్లో స్పాట్ వెండి స్వల్పంగా ఔన్సుకు 32.32కి పడిపోయింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీ అనలిస్ట్ సౌమిల్ మాట్లాడుతూ మంగళవారం విడుదల కానున్న ఎన్వై ఎంపైర్ స్టేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్‌తో సహా యూఎస్ మైక్రో డేటాపై పెట్టుబడిదారులు దృష్టి పెట్టారన్నారు. ప్రధానంగా టారిఫ్ సంబంధిత ముఖ్యాంశాలపై పెట్టుబడిదారులు దృష్టి పెడృతారని.. ఇది బులియన్ ధరలను ప్రభావితం చేస్తుందని సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇక 22 క్యారెట్ల గోల్డ్ హైదరాబాద్‌లో రూ.87,200 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.95,180కి చేరింది. కిలో వెండి రూ.1.09లక్షలు పలుకుతున్నది.