Gold Price | బంగారం ధరలు (Gold Price) రోజురోజుకి పెరుగూతూనే ఉన్నారు. సరికొత్త రికార్డులకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరానికి వెళ్తున్నాయి. ఇప్పటికే రూ.80 వేల మార్కును దాటిన బంగారం ధరలు రూ.90 వేల దిశగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ధరల పెరుగుతుండటంతో దేశంలోని బులియన్ మార్కెట్లో కూడా ఈ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,719 పెరిగి రూ.81,340కు చేరుకుంది. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,340కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.74,560గా ఉన్నది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 81,490గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,710కి చేరింది. కాగా, వెండి ధరలు తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. కిలోకు రూ.వంద తగ్గి రూ.లక్షా 8 వేలకు చేరాయి.
బంగారం ధరలు.. 10 గ్రాములకు
హైదరాబాద్లో- 24 క్యారెట్ రూ.81,340, 22 క్యారెట్ రూ.74,560
ఢిల్లీ- రూ.81,490 (24 క్యారెట్), రూ.74,710 (22 క్యారెట్)
ముంబై- రూ81,340 (24 క్యారెట్), రూ.74,560 (22 క్యారెట్)
చెన్నై- రూ.81,340 (24 క్యారెట్), రూ.74,560 (22 క్యారెట్)
బెంగళూరు- రూ.81,340 (24 క్యారెట్), రూ.74,560 (22 క్యారెట్)
వెండి ధరలు (కిలోకు)..
హైదరాబాద్, చెన్నైలో రూ.108,900 ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రూ.99,900గా ఉన్నది.