Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర Gold Rates | రూ.250 పెరిగి రూ.60,900లకు చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. బుధవారం పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.60,650 వద్ద ట్రేడయింది. కానీ, బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.74,200 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం 1952 డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర తగ్గి 22.94 డాలర్ల వద్ద ముగిసింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు బంగారం ఆల్టర్నేటివ్ పెట్టుబడి ఆప్షన్‌గా కనిపిస్తున్నది. మరోవైపు అమెరికా మాక్రో డేటా, ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పీచ్‌పై ట్రేడర్లు ఫోకస్ చేశారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
స్పాట్ గోల్డ్ మార్కెట్లో బంగారానికి గిరాకీ ఎక్కువగా ఉన్నా.. ఫ్యూచర్స్ మార్కెట్లో డిమాండ్ పడిపోయింది. ఫలితంగా గురువారం ఫ్యూచర్స్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.60 వేల దిగువన నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ ధర 0.33 శాతం తగ్గి రూ.59,875 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం 0.49 శాతం తగ్గి 1958.60 డాలర్ల వద్ద తచ్చాడుతున్నది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్, ముంబైల్లో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.270 పెరిగి రూ.60,760 వద్ద నిలిచింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.250 పెరిగి రూ.55,700 వద్ద స్థిర పడింది. ముంబైలో కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.74,100 వద్ద ట్రేడయితే, హైదరాబాద్‌లో రూ.77,500 వద్ద ముగిసింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారట్స్ బంగారం తులం ధర రూ.220 పెరిగి రూ.60,930 వద్ద ముగిస్తే, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.55,850 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.77,500 వద్ద ట్రేడయింది.