Gold Price | న్యూఢిల్లీ, జూన్ 21: బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. శుక్రవారం హైదరాబాద్లో తులం 24 క్యారెట్ పుత్తడి రేటు రూ.810 పుంజుకొని రూ.73,250ని చేరింది. 22 క్యారెట్ ధర రూ.750 అందుకుని రూ.67,150గా నమోదైంది. వరుసగా 4 రోజులు స్థిరంగా లేదా పడిపోతూ వచ్చిన పసిడి విలువ.. గురువారం కూడా పెరిగిన విషయం తెలిసిందే.
ఇక వెండి ధర మరో రూ.1,500 ఎగబాకింది. కిలో 94,000 పలుకుతున్నది. క్రితం రోజు కూడా రూ.1,500 ఎగిసిన సంగతి విదితమే. ఢిల్లీలోనూ 24 క్యారెట్ బంగారం రూ.73,350గా, కిలో వెండి రూ.93,700గా ఉన్నది. ఈ ఒక్కరోజే రూ.800, రూ.1,400 చొప్పున ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. కొమెక్స్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర ఒకేసారి 28 డాలర్లు పెరిగి 2,360 డాలర్లు పలికింది. ఔన్సు వెండి 30.40 డాలర్లుగా ఉన్నది.