Gold Rate | చెన్నైలో సోమవారం పది గ్రాముల బంగారం ధర ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. 24 క్యారట్ల బంగారం తులం రూ.61,960 పలికింది. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.56,800లకు చేరుకున్నది.
ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో స్థిరంగా కొనసాగుతున్నది. ఢిల్లీలో పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) రూ.61,570, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.56,450 వద్ద కొనసాగుతున్నది.
కోల్కతా, ముంబై నగరాల్లో 22 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.56,300, 24 క్యారట్ల బంగారం తులం రూ.61,420 వద్ద నిలిచింది. కోల్ కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,300 కాగా, చెన్నైలో రూ.79 వేలు పలుకుతున్నది.
హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, విశాఖపట్నం నగరాల్లోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.61,420, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.56,300 వద్ద కొనసాగుతున్నది. ఈ నగరాల పరిధిలో కిలో వెండి ధర రూ.79 వేలకు చేరుకున్నది.