Gold Price | న్యూఢిల్లీ, ఆగస్టు 12: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల రేటు రూ.270 ఎగిసి రూ.70,580ని తాకింది. 22 క్యారెట్ రూ.250 ఎగబాకి రూ.64,700గా నమోదైంది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో తులం మేలిమి పుత్తడి ధర రూ.1,310 పెరిగినైట్టెంది. ఆభరణాల పసిడి సైతం రూ.1,200 పుంజుకున్నది.
ఇక ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన గోల్డ్ రేటు రూ.200 పుంజుకొని రూ.72,350గా ఉన్నది. 99.5 స్వచ్ఛతతో ఉన్నది రూ.72,000గా నమోదైంది. ఇదిలావుంటే వెండి ధర రూ.1,000 అందుకుని రూ.83,500ను చేరింది. హైదరాబాద్లో రూ.87,500 పలికింది.
అంతర్జాతీయంగా చూస్తే ఔన్సు గోల్డ్ రేటు 8.40 డాలర్లు పెరిగి 2,481.80 డాలర్లుగా ఉన్నది. ఔన్సు వెండి 28.01 డాలర్లుగా నమోదైంది. కొనుగోలుదారులు, ఆభరణాల తయారీదారుల నుంచి పెరిగిన డిమాండే ధరలను పరుగులు పెట్టిస్తున్నాయని మార్కెట్ వర్గాలు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు.