న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. దేశీయ మార్కెట్లో శుక్రవారం కూడా డౌన్ ట్రెండ్ కొనసాగింది. నగల వ్యాపారులు, మదుపరులు లాభాల స్వీకరణకే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రెండు వారాల కనిష్ఠాన్ని తాకాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి 10 గ్రాములు రూ.500 తగ్గి రూ.87,700లుగా ఉన్నది. కిలో వెండి రేటు రూ.2,100 పడిపోయి రూ.96,400కు పరిమితమైంది.
గురువారం పసిడి విలువ తులం రూ.1,150, కిలో వెండి రూ.1,000 దిగిన విషయం తెలిసిందే. కాగా, బంగారం ధర ఇటీవల ఆల్టైమ్ హైని తాకిన సంగతి విదితమే. 10 గ్రాముల మేలిమి పసిడి మునుపెన్నడూ లేనివిధంగా రూ.89,450గా నమోదైంది. అయితే గత వారం రోజులుగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నది బులియన్ మార్కెట్.
అయినప్పటికీ ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా చూసినైట్టెతే తులం రూ.8,310 లేదా 10.5 శాతం పెరగడం గమనార్హం. జనవరి 1న రూ.79, 390గా ఉన్నది. ఇదిలావుంటే హైదరాబాద్లో తులం 24 క్యారెట్ గోల్డ్ రూ.86,840, 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రూ.79,600గా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔ న్స్ బంగారం 2,862.53 డాలర్లుగా ఉన్నది.