న్యూఢిల్లీ, జూన్ 19: గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వెండి ఎట్టకేలకు శాంతించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,000 తగ్గి రూ.1,07,200కి దిగొచ్చింది. ఈవారంలో వెండి ధర చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,08,200 పలికిన విషయం తెలిసిందే.
రికార్డు స్థాయికి దూసుకుపోవడంతో వెండిని కొనుగోలు చేయడానికి సామాన్యులు జంకుతున్నారు. వెండితోపాటు బంగారం ధరలు కూడా దిగొచ్చాయి. బంగారం ధర రూ.150 తగ్గి రూ.1,00,560గా నమోదైంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర రూ.99,800కి తగ్గింది. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకున్న నిర్ణయంతో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయని విశ్లేషకులు చెపుతున్నారు.