హైదరాబాద్, ఆగస్టు 21: జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ భారీ స్థాయిలో నిధులను సేకరించడానికి సిద్ధమైంది. సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా రూ.5 వేల కోట్ల నిధుల సేకరణకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. న్యూఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కార్గొ సిటీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి సంస్థ ప్రత్యేక పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయడానికి బోర్డు అనుమతినిచ్చింది.
ఒకేసారి లేదా పలు వాయిదాల్లో సేకరించాలని సంస్థ యోచిస్తున్నది. దీంతోపాటు విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లను జారీ చేయడం ద్వారా నిధులను సేకరించాలనుకుంటున్నది.