న్యూఢిల్లీ, నవంబర్ 23: ఇండిగో.. విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. విమాన టికెట్‌పై 6 శాతం రాయితీతోపాటు 10 కిలోల అదనపు లగేజీకి అవకాశం ఇచ్చింది. కంపెనీ వెబ్సైట్, యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికే ఆఫర్. విద్యార్థుల అకాడమి ఏడాదికి సంబంధించిన బుక్స్ అధికంగా ఉంటాయని, ఈ నేపథ్యంలో 10 కిలోల లగేజీ తీసుకుపోవడానికి అనుమతినిచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక ఆఫర్ హైదరాబాద్‌తోపాటు గోవా, ముంబై, ఢిల్లీ, బెంగళూరుతోపాటు 80 రూట్లలో నుంచి నడిచే విమాన సర్వీసుల్లో అందుబాటులో ఉంటాయి. 12 ఏండ్లకు పైబడి స్కూల్/యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డు ఉన్నవారికే ఈ ఆఫర్.