న్యూఢిల్లీ, డిసెంబర్ 12: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కూడా వాహన ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. జనవరి నుంచి అన్ని రకాల వాహన ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు వెల్లడించింది.
యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వాహన ధరలను పెంచాల్సివస్తున్నదని పేర్కొంది. ప్రస్తుతం రూపాయి-యూరో విలువ 100కి పడిపోయింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు లాజిస్టిక్ ఖర్చులు కూడా అధికమడం కూడా ధరల పెంపునకు ప్రధాన కారణాలని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.