Gautam Adani | భారత్లో అతిపెద్ద కుబేరుడి (Billionaire) గా గౌతం అదానీ (Gautam Adani) (62) నిలిచారు. ఇప్పటి వరకూ దేశంలో అతిపెద్ద కుబేరుడి (Billionaire) స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ని దాటేసి.. 2024 హురున్ ఇండియా సంపన్నుల జాబితా (Hurun India Rich List) లో గౌతం అదానీ మొదటి స్థానంలో నిలిచారు. గౌతం అదానీ అండ్ కుటుంబం (Gautam Adani & Family) సంపద విలువ రూ.11.6 లక్షల కోట్లని హురున్ ఇండియా (Hurun India) పేర్కొంది. గతేడాది ప్రతి ఐదు నిమిషాలకో బిలియనీర్ పుట్టుకొచ్చాడని వెల్లడించింది. 2024 జూన్ 31 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా సంపన్నుల జాబితా రూపొందించినట్లు హురున్ ఇండియా (Hurun India) పేర్కొంది. భారత్ కుబేరుల జాబితాలో తొలిసారి బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ (Sharukh Khan) చోటు దక్కించుకున్నారు.
రూ.10,14,700 కోట్ల వ్యక్తిగత సంపదతో 2024 హురున్ ఇండియా (Hurun India) సంపన్నుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) రెండో స్థానంలో నిలిచారు. రూ.3.14 లక్షల కోట్లతో హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) అధినేత శివ్ నాడార్ అండ్ ఫ్యామిలీ (Shiv Nadar and Family) మూడో స్థానానికి చేరుకున్నది. ఇక వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India) అధినేత సైరస్ ఎస్ పూనావాలా అండ్ కుటుంబం (Cyrus S Poonawala & Family), సన్ ఫార్మాస్యూటికల్స్ (Sun Pharmaceutical Industries) అధినేత దిలీప్ సంఘీ (Dilip Shanghvi) నాలుగో, ఐదో స్థానంలో ఉన్నారు.
గత ఐదేండ్లుగా టాప్-10 భారత కుబేరుల్లో ఆరుగురు వ్యక్తులు కొనసాగుతున్నారు. వారిలో గౌతం అదానీ అండ్ ఫ్యామిలీ, ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ, శివ్ నాడార్, సైరస్ ఎస్ పూనావాలా అండ్ ఫ్యామిలీ, గోపిచంద్ హిందుజా అండ్ ఫ్యామిలీ, డీమాట్ అధినేత రాధాకిషన్ దమానీ అండ్ ఫ్యామిలీ ఉన్నారు.
ఇక తొలిసారి హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైసీ కోల్ కతా నైట్ రైడర్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థల్లో వాటా విలువ పెరగడంతో భారత్ సంపన్నుల జాబితాలో ఆయనకు ప్లేస్ దక్కింది. ఆయన వ్యక్తిగత సంపద రూ.7300 కోట్లు అని హురున్ ఇండియా పేర్కొంది.
ఇక 21 సంవత్సరాల కైవల్య వోహ్రా అనే కుర్రాడు సైతం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో ప్లేస్ కొట్టేశారు. యంగ్ బిలియనీర్స్ ఇండియా లిస్టులో ప్రముఖ క్విక్ కామర్స్ స్టార్టప్ సంస్థ జెప్టో సహ- వ్యవస్థాపకుడిగా కైవల్య వోహ్రా మొదటి స్థానంలో నిలిస్తే, ఆ సంస్థ మరో సహ- వ్యవస్థాపకుడు ఆదిత్ పలిచా (22) రెండో స్థానం సంపాదించుకున్నారు.
Reliance AGM | ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన.. రిలయన్స్ వాటాదారులకు బోనస్ షేర్లు..|
Apple – Jobs | ఉద్యోగార్థులకు ఆపిల్ ఆఫర్.. ఏడు నెలల్లో ఆరు లక్షల కొలువులు