Relief for Future | ఫ్యూచర్స్‌కు బిగ్ రిలీఫ్.. ఆస్తుల జప్తు వద్దు.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
Relief for Future రిలయన్స్‌తో డీల్‌పై ఫ్యూచర్ గ్రూప్ ముందుకె ళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. సింగపూర్ కోర్టు తీర్పు కోసం వేచి ఉండాలన్నది.

Relief for Future | రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీనం వివాదంపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మీద సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఈ వివాదంపై సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న అమెజాన్ పిటిషన్‌పై స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. ఫ్యూచర్ గ్రూప్ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఫ్యూచర్ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని ధర్మాసనం విచారించింది. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు తుది ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. తదుపరి ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
సెబీ తదితర సంస్థలకు ఇలా ఆదేశాలు..
ఈ ఒప్పందం అమలు చేయొచ్చునని ఎటువంటి ధృవీకరణ నిర్ణయాలు వెలువరించొద్దని ఎన్సీఎల్టీ, సీసీఐ, సెబీలకు కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రూ.24,713 కోట్లకు రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి రెండు సంస్థల మధ్య గతేడాది ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
అమెజాన్‌తో డీల్‌కు ఫ్యూచర్ తిలోదకాలు..
అంతకుముందే ఫ్యూచర్స్ కూపన్స్‌లో అమెజాన్ పెట్టుబడులు పెట్టింది. భవిష్యత్‌లో ఫ్యూచర్ గ్రూప్ విక్రయిస్తే తొలుత తనకే ఇవ్వాలన్న షరతు ఫ్యూచర్ కూపన్స్-అమెజాన్ మధ్య కుదిరిన ఒప్పందం సారాంశం. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఫ్యూచర్ రిటైల్ యాజమాన్యం.. రిలయన్స్ రిటైల్‌లో విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నది.
ఇలా న్యాయపోరాటం షురూ..
దీంతో అమెజాన్-ఫ్యూచర్ మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం మొదలైంది. ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందానికి వ్యతిరేకంగా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు అత్యవసర ఆదేశాలు చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

