న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఫ్రాన్స్నకు చెందిన ఏడీపీ..జీఎమ్మార్ ఎయిర్పోర్ట్లో తన వాటాను తగ్గించుకున్నది. 7.3 శాతం వాటాను రూ.10,100 కోట్లకు జీఎమ్మార్ ప్రమోటర్ గ్రూపునకు విక్రయించింది. దీంతో జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్లో ఏడీపీ వాటా 32.3 శాతం నుంచి 25 శాతానికి తగ్గనున్నది. ప్రస్తుతం జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్..ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లతోపాటు పలు విమానాశ్రయాలను నిర్వహిస్తున్నది.
ఎయిర్పోర్ట్ విభాగంలో తనకున్న వాటాలో 7.3 శాతం వాటాను ప్రమోటర్ గ్రూపునకు విక్రయించినట్టు ఫ్రెంచ్ గ్రూపు తాజాగా వెల్లడించింది. పూర్తిగా నగదు రూపంలో జరిగిన ఈ ఒప్పందం 924 మిలియన్ల యూరోలని పేర్కొంది. ప్రస్తుత ఎక్సేంజ్ రేటు ప్రకారం 1.08 బిలియన్ డాలర్లు లేదా రూ.10,100 కోట్లకు పైమాటే. ఈ ఒప్పందంపై జీఎమ్మార్ వర్గాలు స్పందించడానికి నిరాకరించారు. జీఏఎల్లో జీఎమ్మార్ ప్రమోటర్లు 34.9 శాతం వాటా కలిగివుండగా, ఈ కొనుగోలు తర్వాత ఈ వాటా 42.2 శాతానికి పెరుగనున్నది.