ముంబై, జూలై 11: విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 4తో ముగిసిన వారంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 3.049 బిలియన్ డాలర్లు తరిగిపోయి 699.736 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది.
మరోవైపు, గతవారంతానికిగాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు విలువ 3.537 బిలియన్ డాలర్లు తగ్గి 591.287 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అలాగే పసిడి రిజర్వులు 342 మిలియన్ డాలర్లు ఎగబాకి 84.846 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.