తగ్గిన విదేశీ పెట్టుబడులు
రియల్ రంగంలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో విదేశీ పెట్టుబడిదారులు కేవలం 11 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ వెస్టిన్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన 791.4 మిలియన్ డాలర్లతో పోలిస్తే 99 శాతం తగ్గాయని పేర్కొంది.
- రియల్టీలోకి జనవరి-మార్చి మధ్యకాలంలో కేవలం 11 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: రియల్ రంగంలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో విదేశీ పెట్టుబడిదారులు కేవలం 11 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ వెస్టిన్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన 791.4 మిలియన్ డాలర్లతో పోలిస్తే 99 శాతం తగ్గాయని పేర్కొంది. మొత్తంగా ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లు 552 మిలియన్ డాలర్లు వచ్చాయి.
ఏడాది క్రితం ఇదే సమయంలో వచ్చిన 1,238.3 మిలియన్ డాలర్ల(1.23 బిలియన్ డాలర్లు) కంటే ఇది 55 శాతం తగ్గాయి. జనవరి-మార్చి మధ్యకాలంలో 541.1 మిలియన్ డాలర్లు దేశీయ ఇన్వెస్టర్లు నిధులు చొప్పించారు. రియల్ ఎస్టేట్ రంగంపై దేశీయ పెట్టుబడిదారులు ఆశాభావంతో ఉండటంతో భారీగా నిధులు కుమ్మరించారని వెస్టిన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు. కానీ, అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండటంతో విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజవేస్తున్నారన్నారు.
- కమర్షియల్ విభాగంలోకి(ఆఫీస్, రిటైల్, కో-వర్కింగ్, ఆతిథ్యరంగ ప్రాజెక్టులు) అత్యధికంగా 231.6 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఏడాది క్రితం వచ్చిన 484.8 మిలియన్ డాలర్లతో పోలిస్తే సగానికి సగం పడిపోయాయి.
- రెసిడెన్షియల్ ఆస్తులు 33 శాతం తగ్గి 337.7 మిలియన్ డాలర్ల నుంచి 225 మిలియన్ డాలర్లకు పడిపోయాయి.
- ఇండస్ట్రియల్, గిడ్డంగులు రంగంలోకి కేవలం 58.9 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడాది క్రితం వచ్చిన 215.8 మిలియన్ డాలర్లతో పోలిస్తే 73 శాతం తగ్గాయి.
- పెట్టుబడులు ఆకట్టుకున్న నగరాల్లో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. 299 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ తర్వాతి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోకి 110 మిలియన్ డాలర్లు వచ్చాయి. మొత్తం పెట్టుబడుల్లో ఈ రెండు మెట్రో నగరాల వాటా 74 శాతంగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

