Flipkart | ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను (employees) తొలగిస్తున్నాయి. అయితే, వాల్‌మార్ట్‌కు చెందిన ఇ-కామర్స్ (Walmart-owned e-commerce) దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మాత్రం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వేల సంఖ్యలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడాది 5 వేల మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తాజాగా కంపెనీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్లిప్‌కార్ట్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సీమా నాయర్ ఈ నియామక ప్రణాళికలను ప్రకటించారు. క్విక్ కామర్స్, ఫిన్‌టెక్, కృత్రిమ మేధ (AI) రంగాల్లో విస్తరణపై దృష్టి సారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ‘మినిట్స్’ పేరిట క్విక్ కామర్స్ సేవలు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారులకు వేగవంతమైన డెలివరీ సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. యూపీఐ (UPI) పేమెంట్స్ జరిపేందుకు సూపర్.మనీ (Super.money) పేరుతో తీసుకొచ్చిన అప్లికేషన్‌పై దృష్టి సారించింది. ఈ విభాగాల్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నూతన నియామకాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read..
BSF | పాక్‌లో 2.2 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి దాడులు.. భారత్ దెబ్బకు పారిపోయిన పాక్ రేంజర్లు
Bomb Blast | చేతిలోనే పేలిన బాంబు.. దుండగుడు మృతి
IBM Layoffs | ఏఐ ఎఫెక్ట్‌తో ఐబీఎమ్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 8 వేల మందిపై వేటు..!