Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్‌గా ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,396.92 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,122.02 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 80,661.31 పాయింట్ల వరకు పెరిగింది. చివరకు 70.02 పాయింట్లు పెరిగి.. 80,288.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 7.45 పాయింట్లు పెరిగి 24,335.95 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1766 షేర్లు లాభపడ్డాయి. మరో 2012 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎటర్నల్, ట్రెంట్ లాభాలను ఆర్జించాయి. సన్ ఫార్మా, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. రంగాల వారీగా చూస్తే క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5శాతం నుంచి ఒకశాతం దాకా పెరిగాయి. మెటల్, పవర్, టెలికాం, ఫార్మా 0.5శాతం నుంచి ఒకశాతం వరకు పతనయ్యాయి.