ముంబై, మే 23: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకీ మోటర్‌సైకిల్..దేశీయ మార్కెట్‌కు తన తొలి ఈ-స్కూటర్ ఈ-యాక్సెస్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది.
ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో ప్రదర్శించిన ఈ వాహనాన్ని గురుగ్రామ్‌లో ఉన్న తన ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. సుజుకీ ఈ-టెక్నాలజీ, లిథియం-ఐరన్-ఫాస్పెట్ బ్యాటరీ వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది.