Amit Shah Commitee on Maharaja | కేంద్రప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ఘర్‌వాపసీ కానుందా.. దేశీయంగా విమానయాన సేవలు ప్రారంభించిన టాటా గ్రూప్ చేతుల్లోకే వెళుతుందా.. ఇతర బిడ్డర్ల కంటే టాటా సన్స్ ఎక్కువ మొత్తం బిడ్ దాఖలు చేసిందని వార్తలొస్తున్నాయి. స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ సారధ్యంలోని కన్సార్టియం కూడా ఎయిర్ ఇండియా కోసం పోటీ పడుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సారధ్యంలోని సీనియర్ మంత్రుల కమిటీ దీనిపై వారంలోపు తుది నిర్ణయం తీసుకోనున్నదని తెలుస్తోంది. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా సభ్యులు.
ఎయిర్ ఇండియా టేకోవర్ కోసం బిడ్డర్లకు రిజర్వ్ ప్రైస్ రూ.15,000-20,000 కోట్ల మధ్య ఉండొచ్చునని అంచనా. ఈ వారం వివిధ శాఖల కార్యదర్శుల కమిటీ రిజర్వ్ ధరను ఖరారు చేసినట్లు సమాచారం. అజయ్ సింగ్ సారధ్యంలోని స్పైస్‌జెట్ కన్సార్టియం కంటే, ప్రభుత్వ ప్రతిపాదిత రిజర్వు ధర కంటే టాటా సన్స్ గ్రూప్ ఎక్కువ బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తున్నది. వారంలోపు మంత్రుల కమిటీ సమావేశమై ఈ నెలాఖరులోపు ఎయిర్ ఇండియా విక్రయ ప్రక్రియను పూర్తి చేస్తుందని భావిస్తున్నారు.
నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను విక్రయించడానికి 20 ఏండ్లుగా కేంద్రం ప్రయత్నించింది. ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి లేకపోవడంతోపాటు వివిధ కారణాల వల్ల ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. 21 ఏండ్ల క్రితం అప్పటి పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రి అరుణ్‌శౌరి హయాంలో ఎయిర్ ఇండియా విక్రయానికి బిడ్లు ఆహ్వానించారు. నాడు టాటా గ్రూప్‌తో కలిసి సింగపూర్ ఎయిర్‌లైన్స్ బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం. 40 శాతం వాటా కొనుగోలు చేయడానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ ముందుకొచ్చింది. కానీ ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్లిపోయింది.
ఇదిలా ఉంటే, ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆహ్వానించిన బిడ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వచ్చిన వార్తలను ఆర్థికశాఖ అధికారులు కొట్టి పారేశారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే ట్వీట్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు మీడియాకు వెల్లడిస్తామన్నారు.
ఎయిర్ ఇండియాకు ఉన్న లాండింగ్ అండ్ పార్కింగ్ స్లాట్లు 4,400 (దేశీయంగా), 1800 (విదేశాల్లో) కొత్త యజమాని సొంతం అవుతాయి. విదేశీ విమానాశ్రయాల పరిధిలో 900 స్లాట్లు నూతన యజమానికి దఖలు పడతాయి. గమ్మత్తేమిటంటే 1932 అక్టోబర్ 15న తొలి విమానాన్ని కరాచీ నుంచి ముంబైకి జేఆర్డీ టాటా తీసుకొచ్చారు. 1953లో టాటా ఎయిర్ సర్వీస్ పేరుతో రిజిస్టరైన సంస్థే తర్వాత ఎయిర్ ఇండియా మారింది.
chai sam divorce | నాగ చైతన్య, సమంత విడాకులు.. కారణాలు ఇవేనా..?
Naga chaitanya samantha divorce | సమంతకు చైతూ భరణంగా అన్ని కోట్లు …
chai sam divorce | మేం విడిపోతున్నం.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య, సమంత
పెట్రో మంటలు : ఆ నగరంలో రూ 114కి ఎగబాకినపెట్రోల్ ధర!