Exports | న్యూఢిల్లీ, జనవరి 15: దేశీయ ఎగుమతులు వరుసగా రెండో నెలా క్షీణించాయి. గత నెల డిసెంబర్లో 38.01 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. 2023 డిసెంబర్‌తో పోల్చితే 1 శాతం పడిపోయాయి. మరోవైపు దిగుమతులు దాదాపు 5 శాతం పెరిగి 59.95 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.
దీంతో వాణిజ్య లోటు 21.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా, పెట్రోలియం, రత్నాలు, ఆభరణాలు, రసాయనాల ఎగుమతులు పతనమైపోయాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గరిష్ఠంగా 28.62 శాతం దిగజారినట్టు బుధవారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో తేలింది.
ఇక నిరుడు ఏప్రిల్-డిసెంబర్ ఎగుమతులు 321.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 532.48 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటు 210.77 బిలియన్ డాలర్లుగా నమోదైంది.