HDFC Festive offer on Home loan | పండుగల సీజన్ వచ్చేసింది.. దాంతోపాటు సొంతిల్లు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించే వారికి శుభ తరుణం కూడా వచ్చేసింది. బ్యాంకులన్నీ ఇండ్ల కొనుగోలుదారులకు తక్కువ వడ్డీకే రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఫెస్టివ్ సీజన్లో ఇండ్ల రుణాలు తీసుకునే కస్టమర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అన్ని శ్లాబ్‌ల రుణాలపైనా 6.70 శాతం వడ్డీరేట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 31 వరకు అన్ని నూతన ఇండ్ల రుణాలకు వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.
సొంతింటి కోసం రుణాలు తీసుకునే ఖాతాదారుల క్రెడిట్ స్కోర్‌ను బట్టి స్పెషల్ వడ్డీరేట్లు అందిస్తున్నది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా ప్రత్యేక వడ్డీరేటు ఆఫర్ వచ్చేనెలాఖరు వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ఈ తమ నిర్ణయం ఇంటి కొనుగోలుదారులకు చేయూతనిస్తుందని తాము విశ్వాసంతో ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ రేణు సుద్ కర్నాడ్ తెలిపారు. ప్రస్తుతం ఆస్తుల (ఇండ్ల) ధరలు స్తంభించిపోవడమో, తగ్గుముఖం పట్టడంతో జరిగాయి.
బ్యాంకుల వడ్డీరేట్లు చారిత్రకంగా కనీస స్థాయికి పడిపోయాయని హెచ్డీఎఫ్సీ ఎండీ రేణు సుద్ కర్నాడ్ చెప్పారు. దీనికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవో) పథకం కింద లబ్ధి పొందొచ్చు. హచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్ నుంచే కస్టమర్లు ఇంటి రుణం కోసం దరఖాస్తు చేయొచ్చు. క్రెడిట్ స్కోర్ 800, అంతకంటే ఎక్కువగా ఉన్న కస్టమర్లు ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
రూ.75 వేల పై చిలుకు వేతనం పొందుతూ ఇంటి రుణం తీసుకున్న వారిపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7.15 శాతం వడ్డీరేటు వసూలు చేసేది. వ్యాపారవేత్తలకైతే అది 7.30%గా ఉంటుంది. వ్యాపారవేత్తల క్రెడిట్ స్కోర్ కూడా 800 ఉన్నప్పుడే ఈ స్పెషల్ మినహాయింపులు ఉంటాయి. తాజాగా పండుగల సీజన్లో వడ్డీరేటు తగ్గించడంతో కస్టమర్లు… వేతన జీవులకు 45 బేసిక్ పాయింట్లు, వేతనేతర కస్టమర్లకు 60 బేసిక్ పాయింట్లు ఆదా అవుతాయి. 100 బేసిక్ పాయింట్లు అంటే ఒక శాతం అని అర్థం.
రూ.75 లక్షల వరకు ఇంటి రుణాలపై అన్ని క్యాటగిరీల వారికి 7.15 నుంచి 6.70 శాతం వడ్డీరేటుపై రుణాలిస్తున్నట్లు గతవారం ఎస్బీఐ ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.60 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్ 6.50 శాతం వడ్డీరేటుపై ఇంటి రుణాలిస్తున్నాయి.