మదుపరులకు అన్నివేళలా అత్యంత సురక్షిత పెట్టుబడులుగా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)ను చెప్పవచ్చు. అయినప్పటికీ వడ్డీరేట్లు, పన్నుల ఆధారంగా కొన్ని లో-రిస్క్ సాధనాల్లో మరింతగా రాబడులు వచ్చే వీలున్నది. వాటిని పరిశీలిస్తే..
మనీ మార్కెట్ సాధనాలు, బాండ్లలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. రాబడులు మార్కెట్ పరిస్థితులు, ట్రేడింగ్‌కు లోబడి ఉంటాయి. అయితే ఎఫ్డీలకంటే కొన్ని రకాల డెట్ ఫండ్స్‌పై పన్నులు తక్కువగా ఉండగలవు. పెట్టుబడి వ్యవధి, పన్ను నిబంధనలకు లోబడి ఇవి వర్తిస్తాయి.
ఈ పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం హామీతో ఉంటాయి. కాబట్టి మదుపరులకు చట్టపరమైన భద్రత ఉన్నట్టే. అలాగే మె చ్యూరిటీదాకా ఉంటే రాబడులు కూడా నిర్దిష్టంగానే వస్తాయి.
వీటికి కూడా కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. బెంచ్‌మార్క్ రేట్ల ఆధారంగా వడ్డీరేట్లు నిర్ణీత వ్యవధికోసారి మారుతూ ఉంటాయి. అయినప్పటికీ ఆశించిన ఆదాయం మదుపరులకు అందగలదు. కానీ లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లు కూడా సురక్షిత పెట్టుబడి సాధనాలే. నిలకడైన రాబడులు పొందవచ్చు. వడ్డీరేట్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి.
హై-రేటింగ్ కంపెనీలు జారీచేసే బాండ్లు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా మదుపరులకు ఎక్కువ వడ్డీ
దక్కవచ్చు. అయితే క్రెడిట్ రిస్క్ ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు దీన్ని గుర్తించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.