EPFO | తేడాలు సరిచేయడానికి నెల గడువు.. అధిక పెన్షన్ దరఖాస్తులపై ఈపీఎఫ్ఓ సర్క్యులర్
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, యాజమాన్యాలు సమర్పించిన సమాచారం, వేతన వివరాల స్క్రూటి నీ విధానంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) తాజాగా ఒక సర్క్యులర్ జారీచేసింది. ఈ దరఖాస్తులకు మే 3గడువు తేదీగా గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23వ తేదీతో విడుదల చేసిన సర్క్యులర్ వివరాలు...
EPFO | న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, యాజమాన్యాలు సమర్పించిన సమాచారం, వేతన వివరాల స్క్రూటి నీ విధానంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) తాజాగా ఒక సర్క్యులర్ జారీచేసింది. ఈ దరఖాస్తులకు మే 3గడువు తేదీగా గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23వ తేదీతో విడుదల చేసిన సర్క్యులర్ వివరాలు…
- అధిక పెన్షన్ దరఖాస్తుల్ని, ఉద్యోగులు, యాజమాన్యాలు కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్లను ఫీల్డ్ ఆఫీస్ పరిశీలిస్తుంది.
- యాజమాన్యాలు సమర్పించిన వేతన వివరాలను ఫీల్డ్ కార్యలయాల (ఎఫ్‌వో) గణాంకాలతో సరిచూస్తారు.
- ఎఫ్‌వో వద్దనున్నవి, యాజమాన్యాలు ఇచ్చిన వివరాలు సరిపోలితే..బకాయిల్ని లెక్కించి, వాటిని డిపాజిట్/బదిలీ చేయడానికి ఆర్డర్ పాస్ చేస్తారు.
- వివరాల్లో తేడా ఉంటే ఆ సమాచారాన్ని యాజమాని, ఉద్యోగి/పెన్షనర్‌కు తెలియపర్చి, పూర్తి సమాచారం సమర్పించేందుకు నెల సమయం ఇస్తారు.
- సమర్పించిన దరఖాస్తు ఫారం/ఉమ్మడి ఆప్షన్‌ను యజమాని అప్రూవ్ చేయకపోతే అదనపు ప్రూఫ్‌ను ఇవ్వడానికి, పొరపాట్లను (ఉద్యోగులు/పెన్షనర్లు చేసినవి కూడా) సరిదిద్దడానికి యజమానికి నెలరోజుల గడువు ఇచ్చి, ఆ విషయాన్ని ఉద్యోగులు/పెన్షనర్లకు తెలియపరుస్తారు.
- సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నా, అందులో తప్పులు ఉన్నా, అర్హమైనది కాదని గుర్తించినా యజమానుల నుంచి రీజనల్ ప్రావిడెంట్ ఫం డ్ కార్యాలయం నెలరోజుల్లో సమాచారం కోరుతుంది. ఆ విషయాన్ని ఉద్యోగులు/పెన్షనర్లకు తెలియచేస్తారు.
- పూర్తి సమాచారం అందితే ఆ దరఖాస్తును/ఉమ్మడి ఆప్షన్‌ను ప్రాసెస్ చేస్తారు. ఒక వేళ అందకపోయినా, ఎపీఎఫ్సీ/ఆర్పీఎఫ్సీ-2/ఆర్పీఎఫ్సీ-1 మెరిట్‌ను బట్టి ఆర్డరు జారీచేస్తుంది.
- అధిక పెన్షన్ దరఖాస్తులకు సంబంధించి ఏ వివాదాన్నయినా దరఖాస్తుదార్లు EPFiGMS లో రిజిష్టర్ చేయవచ్చు. సంబంధిత విజ్ఞాపన ఫారాన్ని సమర్పించి, చెల్లింపులేవైనా ఉంటే చేసి వివాదాన్ని రిజిష్టర్ చేయాలి. రిజిష్టర్ చేసే వివాదాలు..అధిక పెన్షన్‌పై 2022 నవంబర్ 1నాటి సుప్రీంకోర్టు తీర్పును రిఫర్ చేసేవి అయి ఉండాలి.
- ఆ వివాదాల్ని రీజనల్, జోనల్ కార్యాలయాలు పర్యవేక్షిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

