Elon Musk | ట్విట్టర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన విద్యుత్ కార్ల సంస్థ టెస్లా (Tesla) ఇటీవలే ఓ హ్యూమనాయిడ్ రోబోను రూపొందించిన విషయం తెలిసిందే. తన సంస్థ రూపొందించిన ఈ భవిష్యత్ హ్యూమనాయిడ్ రోబో (Humanoid Robot ) ‘ఆప్టిమస్’ (Optimus)కు సంబంధించిన వీడియోను టెస్లా తాజాగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
ఈ రోబో అచ్చం మనుషులలానే యోగాసనాలు (Yoga) వేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. యోగాలో వివిధ రకాల భంగిమలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాదు, తనకుతానుగా వస్తువులను గుర్తించి వాటిని ఓ క్రమ పద్ధతిలో సర్దుతోంది. మధ్యలో ఆటంకాలు కల్పించినా సరే ఏమాత్రం డైవర్ట్ కాకుండా తన పనిని తాను చేసుకుపోతోంది. ఈ వీడియోపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. హ్యూమనాయిడ్ రోబో తయారీలో పురోగతి సాధించినట్లు తెలిపారు. అయితే, ఈ రోబోను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా లేదు. కాగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
Optimus can now sort objects autonomously 🤖
Its neural network is trained fully end-to-end: video in, controls out.
Come join to help develop Optimus (& improve its yoga routine 🧘)
→ https://t.co/dBhQqg1qya pic.twitter.com/1Lrh0dru2r
— Tesla Optimus (@Tesla_Optimus) September 23, 2023
— Elon Musk (@elonmusk) September 25, 2023
— Elon Musk (@elonmusk) September 25, 2023
Also Read..
Chandrayaan-3 | చంద్రయాన్-3 కథ ముగిసిందా..? విక్రమ్ ల్యాండర్ నుంచి ఇప్పటికీ అందని సిగ్నల్స్..!
Rs 2,000 Notes | రూ.2వేల నోట్ల మార్పిడికి మరో 5 రోజులే గడువు..
Suryakumar Yadav | 6, 6, 6, 6.. సూర్యకుమార్ సిక్సుల మోత.. వీడియో వైరల్