Elon Musk | ‘ఎక్స్’ను అమ్మేశా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
Elon Musk | టెస్లా బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)ను విక్రయించినట్లు ప్రకటించారు.
Elon Musk | టెస్లా బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)ను విక్రయించినట్లు ప్రకటించారు. తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన xAIకి ‘ఎక్స్’ను 33 బిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని మస్క్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ లావాదేవీ పూర్తిగా స్టాక్ రూపంలో జరిగిందని తెలిపారు. ఎక్స్ఏఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధరించారు.
2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందుకోసం ఆయన ఒక్కో స్టాక్‌కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత మస్క్ అనేక మార్పులు చేపట్టారు. సంస్థ పేరును ట్విటర్ నుంచి ‘ఎక్స్’గా మార్చారు. అదేవిధంగా ట్విట్టర్ పిట్ట స్థానంలోకి ‘X’ను చేర్చారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. కంటెంట్ విషయంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇక చాట్‌జీపీటీకి పోటీగా గతేడాది మస్క్ ‘ఎక్స్ఏఐ’ పేరుతో అంకుర సంస్థను ప్రారంభించారు.
Also Read..
Donald Trump | మోదీ తెలివైన వ్యక్తి.. గ్రేట్ ప్రైమ్ మినిస్టర్.. మన ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు
Earthquake | మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంప బీభత్సం.. 700 దాటిన మృతుల సంఖ్య
Myanmar | మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.2 తీవ్రత
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

