న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: అమెరికా టెక్నాలజీ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21 నుంచి 22 వరకు భారత పర్యటనకు రావాల్సిన ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పర్యాటన ఈ ఏడాది చివరినాటికి వాయిదా పడింది.
కంపెనీకి సంబంధించి కీలక సమావేశాలు జరుగుతుండటం వల్లనే ఈ పర్యటను వాయిదావేసుకుంటున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. దురదృశ్టవశాత్తు టెస్లా బాధ్యతలు అధికంగా ఉండటంతో భారత పర్యటన వాయిదా పడింది..ఈ ఏడాది చివర్లో భారత్‌కు రావడానికి ఉత్సాహంగా ఉన్నాను అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.