హైదరాబాద్, అక్టోబర్ 11: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్.. ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ దసరా పండుగ సందర్భంగా ఏదైన కార్డుతో కొనుగోలుపై రూ.10 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్‌తోపాటు రూ.22,500 వరకు ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నది.
ఈ ఆఫర్లలో భాగంగా రూ.27,499కే 55 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ, రూ.1,14, 990కే ఎల్జీ ఒలెడ్ ఈవీ 4కే స్మార్ట్ టీవీపై మూడేండ్ల వ్యారెంటీ కల్పిస్తున్నది. అలాగే సామ్సంగ్ నియో క్యూలెడ్ 4కే స్మార్ట్ టీవీపై మూడేండ్ల వ్యారెంటీ, 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్, దీంతోపాటు 42,490 విలువైన సామ్సంగ్ 4కే యూహెచ్డీ టీవీని ఉచితంగా ఇస్తున్నది. గృహోపకరణాలపై 15 శాతం వరకు రాయితీతో విక్రయిస్తున్నది.