హైదరాబాద్, ఆగస్టు 18 : మురుగప్పా గ్రూపునకు చెందిన కమర్షియల్ చిన్నస్థాయి ఎలక్ట్రిక్ వాహన విక్రయ సంస్థ మోంత్రా ఎలక్ట్రిక్ రాష్ట్ర మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్‌క్లూజివ్ ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్(ఈఎస్సీవీ) షోరూంను హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభించింది.
ఈ షోరూంలో సింగిల్ చార్జింగ్‌తో 245 కిలోమీటర్లు ప్రయాణించే ఏవియేటర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ వాహనంపై ఏడేండ్లు లేదా 2.5 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ కూడా కల్పిస్తున్నట్టు టీఐ క్లీన్ మొబిలిటీ చైర్మన్ అరుణ్ మురుగప్పా తెలిపారు.