Jio Recharge Plan | గత కొద్దిరోజుల కిందట భారతీయ టెలికం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, ఎస్ఎంఎస్తో మాత్రమే చౌక రీఛార్జ్ ప్లాన్లను తీసుకురావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేట్ టెలికం సంస్థ రిలయన్స్ జియో కాలింగ్, ఎస్ఎంఎస్తో రెండు తక్కువ ధర రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది. ఇందులో యూజర్లకు 365 రోజుల వరకు వ్యాలిడిటీని పొందుతారు. డేటా ఉపయోగించని వారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జియో ఈ ప్లాన్ ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించే వారి కోసం తీసుకువచ్చింది. ఇందులో డేటా మాత్రం అందుబాటులో ఉండదు. ఈ రెండు ప్లాన్స్ రూ.458కి 84 రోజుల వ్యాలిడిటీ, రూ.1958కి 365 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఈ రెండు ప్లాన్స్‌లో యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..!
జియో కొత్త రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లు అపరిమిత కాలింగ్, వెయ్యి ఉచిత ఎస్ఎంఎస్లు పొందుతారు. దాంతో పాటు వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచిత యాక్సెస్ పొందుతారు. ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించే యూజర్ల కోసం మాత్రమే తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్ సర్వీస్ ఆఫర్ చేస్తున్నది.
జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల దీర్ఘకాలిక వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లు భారతదేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. దాంతో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత నేషనల్ రోమింగ్ సౌకర్యం సైతం అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. దాంతో యూజర్లు వినోదాన్ని ఉచితంగాను ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నది.
జియో పాత రీఛార్జ్ ప్లాన్లలో రెండింటిని జాబితా నుంచి తొలగించింది. ఈ ప్లాన్లు రూ.479.. రూ.1899. రూ.1899 ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో 24జీబీ డేటాను అందించగా.. రూ.479 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 6జీబీ డేటా వస్తుండేది. రెండింటిని జియో జాబితా నుంచి తొలగించడంలో ప్రస్తుతం యూజర్లకు అందుబాటులో లేకుండాపోయాయి. ఈ ప్లాన్లకు బదులుగా ఇతర ప్లాన్లపై ఆధారపడాల్సి వస్తున్నది.