ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఓ పాలసీ. ప్రయాణ సమయంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక నష్టాల నుంచి ఇది పాలసీదారులను కాపాడుతుంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్, టాటా ఏఐజీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ, శ్రీరామ్, స్టార్, రాయల్ సుందరం, రిలయన్స్, ఓరియంటల్, చోళమండలం, ఆదిత్యా బిర్లా తదితర సంస్థలు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్నాయి.
కవరేజీలు ఇవే..
ఎలా పనిచేస్తుంది?
ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఓ షార్ట్-టర్మ్ పాలసీ. సాధారణంగా ఇది మీ ప్రయాణం మొదలైన దగ్గర్నుంచి.. తిరిగి మీరు మీ గమ్యస్థానం చేరుకునేదాకా వర్తిస్తుంది. టూర్లో ఉన్నప్పుడు అనారోగ్యం, దురదృష్టవశాత్తు ప్రమాదం బారినపడి వైద్య చికిత్స అవసరమైనా, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనా, పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నా, మధ్యలోనే టూర్‌ను ముగించాల్సి వచ్చినా, విమానాల ఆలస్యం, ఇతర రవాణా ఇబ్బందులకు ఎదురయ్యే ఖర్చులను, నష్టాన్ని పాలసీ ద్వారా తప్పించుకోవచ్చు.
పాలసీ రకాలు