Adani Bribe Case | దేశంలో సోలార్ పవర్ విక్రయ ఒప్పందాల్లో అదానీ గ్రూప్‌పై వచ్చిన లంచం, నేరారోపణల్లో మొత్తం ఎనిమిది మందిపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు, ఉన్నతాధికారులకు రూ.2,200 కోట్లకుపైగా లంచాలు ఎర వేశారన్న అవినీతి ఆరోపణల్ని వీరంతా ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ప్రధానంగా రెండు ఆరోపణలున్నాయి.
అందులో మొదటిది తప్పుడు ప్రకటనలతో భారత్‌లో సోలార్ పవర్ కాంట్రాక్టులను అడ్డుపెట్టుకొని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అమెరికా మదుపరుల నుంచి 2 బిలియన్ డాలర్లకుపైగా రుణాల సమీకరణకు పాల్పడ్డారు. ఇక రెండోది అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను భాగస్వామ్యం చేస్తూ 1 బిలియన్ డాలర్లకుపైగా విలువైన బాండ్లను జారీ చేశారు. వీటిని అమెరికా తదితర మార్కెట్లలో ప్రవేశపెట్టి, అక్కడి మదుపరులకు అమ్మారు. అసలు ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఆ ఎనిమిది మందిలో ఎవరెవరున్నారు?
అదానీ గ్రూప్ చైర్మన్. ఈ కేసుతో సంబంధమున్న అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కూ ప్రమోటర్. సోలార్ పవర్ కాంట్రాక్టులను ఓకే చేసుకొనేందుకు ఆయా ప్రభుత్వ వర్గాలతో గౌతమ్ అదానీ నేరుగా సమావేశమైనట్టు ఆరోపణలున్నాయి. లంచం, అవినీతిని దాచి ఇన్వెస్టర్లను ఉద్దేశపూర్వకంగా మోసం చేశారన్న అభియోగాలు నమోదయ్యాయి.
గౌతమ్ అదానీ మేనల్లుడు. అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ప్రభుత్వ అధికారులకు ఇస్తామని హామీ ఇచ్చిన లంచాల వివరాలను సాగర్ అదానీ తన్ ఫోన్లో దాచుకున్నారన్న ఆరోపణలున్నాయి. నిధుల సమీకరణలోనూ భాగమయ్యారని అంటున్నారు.
అదానీ గ్రీన్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్. గత 15 ఏండ్లుగా అదానీ గ్రూప్‌లో పనిచేస్తున్నారు. ఎవరెవరికి ఎంతెంత? ముట్టజెప్పాలన్న వివరాలను రాసుకొని తన మొబైల్లో వినీత్ జైన్ ఫోటో తీసి పెట్టుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు చెప్తున్నారు.
కుంభకోణం జరిగిన 2019-2022 మధ్య అజుర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ సీఈవోగా వ్యవహరించారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) దాఖలు చేసిన ఫిర్యాదులో రెండో నిందితుడిగా ఉన్నారు. లంచాల్లో కొంత భాగం ఇస్తామని అజుర్ అంగీకరించిందన్న ఆరోపణలున్నాయి.
2022-2023 మధ్య అజుర్ పవర్‌తో రూపేశ్ అగర్వాల్ పనిచేశారు. అమెరికా అటార్ని కార్యాలయం వివరాల ప్రకారం లంచాల సొమ్మును సిద్ధం చేసి, దాని పంపిణీలో కీలకపాత్ర పోషించారు.
ఈయనకు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల పౌరసత్వం ఉన్నది. కెనడియన్ పెన్షన్ ఫండ్ సీడీపీక్యూలో పనిచేశారు. సౌరభ్ అగర్వాల్ సీడీపీక్యూ మాజీ ఉద్యోగి.
సీడీపీక్యూలో పనిచేశారు. అజుర్ పవర్లో సీడీపీక్యూకు మెజారిటీ వాటా ఉన్నది. సీడీపీక్యూ మాజీ ఉద్యోగులైన సిరిల్, సౌరభ్, మల్హోత్ర అనే ఈ ముగ్గురు.. విదేశీ అవినీతి చర్యల చట్టం నిబంధనల్ని ఉల్లంఘిస్తూ లంచాల కేసులో పాలుపంచుకున్నారని ఎఫ్‌బీఐ, అమెరికా ఎస్ఈసీ చెప్తున్నాయి.