e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News ఫ్లిప్‌కార్ట్‌కు షాక్‌... ఫెమా కేసులో ఈడీ నోటీసులు

ఫ్లిప్‌కార్ట్‌కు షాక్‌… ఫెమా కేసులో ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. విదేశీ ప్ర‌త్య‌క్ష ప‌న్నుల చ‌ట్టాల‌ను ఉల్లంఘించిందంటూ ఫ్లిప్‌కార్ట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆ సంస్థ‌తోపాటు తొమ్మిది మందికి ఈ నోటీసులు పంపింది.

పెట్టుబడుల నిబంధనలు అతిక్రమించినందుకు రూ.10,600 కోట్ల (1.35 బిలియ‌న్ల డాల‌ర్లు) జరిమానా చెల్లించాల‌ని ఎందుకు ఆదేశించ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించింది. మూడు నెల‌ల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. 2009-15 మ‌ధ్య పెట్టుబడుల‌ను ఆక‌ర్షించ‌డానికి విదేశీ మార‌క ద్ర‌వ్య చ‌ట్టం (ఫెమా)ను ఉల్లంఘించింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈడీ ద‌ర్యాప్తు చేప‌ట్టింది.

- Advertisement -

ఈడీ జారీ చేసిన నోటీసులపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌.. తాము ఎఫ్‌డీఐ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తున్న‌ట్లు తెలిపింది. భారత చట్టాలకు అనుగుణంగానే తమ సంస్థలో పెట్టుబడులను ఆహ్వానించామని ఓ ప్రకటనలో పేర్కొంది.

అయినా ఈడీ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని వివ‌రించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఉత్పత్తుల అమ్మకాలు జరపడం చట్టప్రకారం నిషేధమని ఈడీ వాద‌న‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana