హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సురానా గ్రూపుపై ఈడీ దాడులు చేసింది. ఈ గ్రూపునకు అనుబంధంగా ఉన్న సాయిసూర్య డెవలపర్స్ కూడా సోదాలు నిర్వహించారు. బుధవారం వేకువ జామున ప్రారంభమైన ఈ దాడులు గ్రూపు చైర్మన్, డైరెక్టర్ ఇండ్లలో ఏకకాలంలో చెన్నైకు చెందిన ఈడీ బృందాలు ఈ సోదాలు నిర్వహించారు.
సురానా గ్రూపు..చెన్నై ఎస్బీఐ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొని ఎగ్గొట్టినట్టు, దీంతో గ్రూపుపై 2012లోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ సమయంలో 400 కిలోల బంగారాన్ని సీబీఐ స్వాధీనం చేసుకున్నది. కాగా, దీంట్లో 103 కిలోల బంగారం మాయం కావడం సంచలనంగా మారింది. ఈ మాయమైన బంగారంపై నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన ఈడీ..ఒకేసారి పదిచోట్ల తనిఖీలు నిర్వహించింది.