హైదరాబాద్, జూన్ 7: డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు చెందిన ఏపీలోని శ్రీకాకుళంలోగల ఏపీఐ తయారీ కేంద్రానికి యూఎస్ఎఫ్డీఏ నాలుగు అబ్జర్వేషన్లతో ఫామ్ 483ని జారీ చేసింది. ఏపీఐ ప్లాంట్‌ను పరిశీలించిన అనంతరం ఇది వచ్చినట్టు తెలిపింది. మే 30 నుంచి జూన్ 7 వరకు ప్లాంట్‌లో తనిఖీలు జరిగాయన్న రెడ్డీస్.. యూఎస్ఎఫ్డీఏ చేసిన సూచనలకు నిర్ణీత సమయంలోనే సమాధానమిస్తామన్నది.