ముంబై, ఆగస్టు 8 : ఈ నెల 1తో ముగిసిన వారం రోజుల్లోనే దేశంలోని ఫారెక్స్ నిల్వలు ఏకంగా 9.32 బిలియన్ డాలర్లు పడిపోయాయి. ఇటీవలికాలంలో కేవలం ఒక్క వారంలోనే ఈ స్థాయిలో ఫారెక్స్ రిజర్వులు క్షీణించడం ఇదే తొలిసారి. కాగా, ప్రస్తుతం 688.871 బిలియన్ డాలర్లుగా దేశీయ ఫారెక్స్ నిల్వలున్నట్టు శుక్రవారం ఆర్బీఐ తెలిపింది.
విదేశీ కరెన్సీ ఆస్తులే 7.319 బిలియన్ డాలర్లు దిగజారినట్టు చెప్పింది. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మోత నేపథ్యంలో ఇప్పుడిది మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.