Jio Plans | న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లకు షాకిచ్చింది. ఎంట్రీ లెవల్ రూ.249 ప్లాన్‌ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1 జీబీ డాటాను అందిస్తున్నది. దేశవ్యాప్తంగా డాటా వినిమయం భారీగా పెరిగిన నేపథ్యంలో తక్కువ డాటా ప్లాన్‌ను ఎత్తివేసి ఈ స్థానంలో రోజుకు 1.5 జీబీల డాటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
ఇతర టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు 28 రోజుల కాలపరిమితితో రూ.299 ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కానీ, జియో మాత్రం ఇప్పటి వరకు రూ.249 ప్లాన్‌ను అందిస్తుండగా, దీనిని ఎత్తివేస్తున్నది. ఎయిర్ టెల్ కూడా ఈ ప్లాన్‌ను ఎత్తేసింది.