ముంబై, జూన్ 4: వరుసగా మూడు రోజులు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కోలుకున్నాయి. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 260.74 పాయింట్లు లేదా 0.32 శాతం పెరిగి 80,998.25 వద్ద స్థిరపడింది.
ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 77.70 పాయింట్లు లేదా 0.32 శాతం అందుకుని 24,620.20 వద్ద నిలిచింది.