ఢిల్లీ, అక్టోబర్ 24: వరుసగా నాలుగో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఎఫ్ఐఐల నిధుల వెనక్కి తీసుకోవడం, ఎఫ్ఎంసీజీ, వాహన రంగ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూజీలు పతనం చెందాయి. సెన్సెక్స్ 16.82 పాయింట్లు కోల్పోయి 80,065.16కి, నిఫ్టీ 36.10 పాయింట్లు పతనం చెంది 24,399.40 వద్ద స్థిరపడింది. హెచ్యూఎల్ షేరు అత్యధికంగా 6 శాతం నష్టపోగా, నెస్లె, ఐటీసీ, మారుతి, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, లార్సెన్ అండ్ టుబ్రో, హెచ్సీఎల్ షేర్లు నష్టపోయాయి. కానీ, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.