ముంబై, ఆగస్టు 13: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. మెటల్, వాహన, ఫార్మా రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ధరల సూచీ తగ్గుముఖం పట్టడంతో గ్లోబల్ మార్కెట్లు ర్యాలీ కొనసాగాయి. ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 304 పాయింట్లు అందుకొని 80,539.81 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 131.95 పాయింట్లు ఎగబాకి 24,619.35 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ధరల సూచీ ఎనిమిదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం సూచీల్లో జోష్ పెంచిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటర్స్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగియగా..అదానీ పోర్ట్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ షేర్లు నష్టపోయాయి.