ముంబై, మే 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 253.31 పాయింట్లు ఎగబాకి 73,917.03 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62.25 పాయింట్లు అందుకొని 22,466.10 వద్ద స్థిరపడింది. మరోవైపు శనివారం దేశీయ స్టాక్ మార్కెట్లు తెరిచివుంచనున్నాయి.
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సైట్లో ఎదురయ్యే అంతరాయాలను నియంత్రించడానికి రెండు సెషన్లలో జరగనున్న ట్రేడింగ్లలో తొలి విడుత ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు, రెండో విడుత ఉదయం 11.30 గంటల నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.